రూ.లక్షల్లో ముడితేనే పని...
కూటమి ప్రభుత్వం అమలుచేస్తున్న కొత్త మద్యం పాలసీతో ఏర్పాటైన ప్రైవేటు మద్యం దుకాణాలే ఇప్పుడు అవినీతి అధికారులకు ఆదాయ వనరుగా మారాయి. ఇప్పుడా దుకాణాల నుంచి రెన్యువల్ పేరుతో రూ.2 లక్షల చొప్పున వసూలు చేయాలని ఎకై ్సజ్ శాఖ కీలక పోస్టులో ఉన్న సదరు ఉన్నతాధికారి ఇండెంట్ పెట్టారు. ఆ మొత్తాన్ని వసూలుచేసే బాధ్యత సంబంధిత ఎకై ్సజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్లకు అప్పగించారు. వాస్తవానికి లాటరీలో దుకాణాలు దక్కించుకున్న నిర్వాహకులకు అప్పటికప్పుడు ఎకై ్సజ్ శాఖ నుంచి తాత్కాలిక పర్మిట్లను జారీచేశారు. ఇప్పుడు రెన్యువల్ చేసుకోవడం ద్వారా ఏడాది కాలానికి పర్మినెంట్ పర్మిట్ జారీ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment