కేంద్రమంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలి
వనపర్తి: రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అనుచిత వాఖ్యలు చేయడం సరికాదని.. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని నాగర్‌కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని.. పౌరుల హక్కులు, స్వేచ్ఛను అంబేడ్కర్ రాజ్యాంగంలో కల్పించారని గుర్తుచేశారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాతకు జరిగిన అవమానాన్ని దేశ ప్రజలందరూ గమనించారని.. ప్రజాస్వామ్యంపై దాడి చేసే ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ఎంపీలు, ఇండియా కూటమి నేతలు పార్లమెంటులో ఉన్న అంబేడ్కర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేయడంతో పాటు అమిత్‌షా రాజీనామాకు డిమాండ్ చేసినట్లు తెలిపారు. అనంతరంఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా బేషరతుగా క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలు, మద్దతు పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకించినట్లు తెలిపారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ ఎం.విష్ణువర్ధన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పి.మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ, కాంగ్రెస్‌పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్, నాయకులు లక్కాకుల సతీష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి.కృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment