హైర్ పర్చెస్ విధానంలో ఇచ్చిన ఇళ్లకు ఏడాదికి 10.5 శాతం వడ్డీతో చెల్లించాలంటూ డాక్యుమెంట్లపై లబ్ధిదారులతో సంతకాలు చేసుకొని ఇళ్లను అప్పగించిన విషయం లబ్ధిదారులకు ఇప్పటికీ తెలియదు. ఏడాదికి రూ.1,832 చెల్లించాలని అప్పట్లో అధికారులు చెప్పినా.. వాటిని పూర్తిస్థాయిలో చెల్లించలేమని లబ్ధిదారులు ప్రభుత్వాకి విన్నవిస్తూ వచ్చారు. అయినా ఇప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో అప్పు భారం తడిసి మోపైడెంది. బీడీ తయారీపై ఆధారపడి జీవిస్తున్న దళితులకు ప్రభుత్వమే బాసటగా ఉంటూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి కోసం చెల్లించే రూ.5 లక్షలు తమ ఇళ్లపై ఉన్న అప్పునకు చెల్లించాలని వేడుకోంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment