చిన్నరాజమూర్లో భక్తుల సందడి
దేవరకద్ర: చిన్నరాజమూర్ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆదివారం భక్తుల సందడి కనిపించింది. వారం రోజులుగా స్వామివారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి దాసంగాలతో నైవేద్యాలను సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. పలువురు భక్తులు ఆవులు, కోడె దూడలను సమర్పించారు. ఆలయం చుట్టూ పొర్లుదండాలు పెట్టారు. గండజ్యోతులతో ప్రదక్షిణలు చేశారు. జాతరలో వెలసిన మిఠాయి, గాజులు, ఆటబొమ్మల దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా కనిపించాయి. మరో వారంపాటు జాతర కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment