వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి అధికార పార్టీ కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, మాజీ మంత్రి, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మధ్య పోరు నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైతం మేఘారెడ్డి, చిన్నారెడ్డి మధ్య ప్రొటోకాల్ రగడ చోటు చేసుకుంది. ఇలా నువ్వా, నేనా అన్నట్లు ఇరు వర్గాలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుండగా.. కొల్లాపూర్‌కు చెందిన కీలక నేత ఒకరు, ఆయన ముఖ్య అనుచరులు వనపర్తి నియోజకవర్గ పరిధిలో పెత్తనం చెలాయించేలా వ్యవహరిస్తుండడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వనపర్తిలోని పలు ప్రభుత్వ శాఖల్లో కీలక పోస్టింగ్‌లు, బదిలీలు, పైరవీల్లో కొల్లాపూర్ నేతలు తమ మార్క్‌ను ప్రదర్శించడంతో పాటు ప్రతి అంశంలో జోక్యం చేసుకుంటున్నట్లు ఇటీవల వెలుగులోకి రాగా.. పార్టీలో కలకలం చెలరేగింది. ఈ క్రమంలో వనపర్తి సెగ్మెంట్‌లో స్థానిక, స్థానికేతర లొల్లి మరోసారి రాజుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment