వేరుశనగకు గడ్డుకాలం
హామీ విస్మరిస్తే కలెక్టరేట్ ముట్టడిస్తాం : సీపీఎం
పాన్‌గల్: అధికారులు ఇచ్చిన మాట ప్రకారం రేమద్దులలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని.. విస్మరిస్తే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎండి జబ్బార్ తెలిపారు. గ్రామ సమస్యలను పరిష్కరించాలంటూ మండలంలోని రేమద్దులలో ప్రజాసంఘాలు, సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు శనివారం నాలుగోరోజుకు చేరాయి. శనివారం మండలస్థాయి అధికారులు ఇచ్చిన హామీ మేరకు దీక్ష విరమించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని 13 సమస్యలను వివరిస్తూ ఎంపీడీఓ గోవిందరావు, డిప్యూటీ తహసీల్దార్ అశోక్‌నాయుడుకు వినతిపత్రాన్ని అందజేశామని, ప్రభుత్వానికి నివేదించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాసంఘాలు, సీపీఎం నాయకులు, ఆర్‌ఐ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
●
జిల్లాలో ఏటా తగ్గుతున్న సాగు
కేఎల్‌ఐ నీరు రావడంతో..
గతంలో సాగునీరు లేక యాసంగిలో ఆరుతడి పంటలైన వేరుశనగ సాగు చేసేవారం. మా ప్రస్తుతం కేఎల్‌ఐ సాగునీరు పుష్కలంగా అందుతుండటంతో ఏడాదిలో రెండుసార్లు వరి సాగు చేస్తున్నాం. ఈ ఏడాది తరి భూమిలో వరి, మెట్ట పొలంలో కొంత వేరుశనగ సాగు చేశాం.
– విజయేందర్‌రెడ్డి,
సల్కెలాపురం (ఖిల్లాఘనపురం)
● ఎనిమిదేళ్లలో సగానికి
పడిపోయిన వైనం
● పెట్టుబడి, కాపలా దృష్ట్యా
ఆసక్తి చూపని రైతులు
● పెరుగుతున్న వరి విస్తీర్ణం
వనపర్తి: జిల్లాలో పండిన వేరుశనగకు అంతర్జాతీయ మార్కెట్‌లో గుర్తింపు ఉంది. కానీ సాగునీటి లభ్యత పెరగడం, సులభ వ్యవసాయానికి అలవాటు పడిన జిల్లా రైతులు వరి సాగుకు మొగ్గుచూపుతుండటంతో ఏటా వేరుశనగ విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. పల్లీ సాగుపై విముఖత చూపుతుండటంతో వరి సారు విస్తీర్ణం నెమ్మదిగా పెరుగుతోంది. వానాకాలం, కత్తెర, యాసంగి పంటలుగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వేరుశనగ సాగు చేసేవారు. 2017–18 యాసంగిలో 59,446 ఎకరాల్లో వేరుశనగ సాగుకాగా.. 2023–24 యాసంగికి వచ్చే సరికి 18,061కి పడిపోయింది. వ్యవసాయశాఖ అధికారుల ప్రోత్సాహం కరువవడం, రైతులు సులభతర పంటల సాగుకు అలవాటు పడటం, అడవి పందుల బెడద అధికం కావడంతో ఏటా వేరుశనగ సాగు తగ్గుతున్నట్లు తెలుస్తోంది.
విదేశాలకు ఎగుమతి..
జిల్లా పరిధిలో పండించిన వేరుశనగలో హిప్లటాక్సీన్ అనే శిలీంధ్రం లేకపోవడంతో ఎక్కువ కాలం నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఇక్కడి పల్లీకి విదేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉండటంతో వ్యాపారులు ప్రాసెసింగ్ చేసి ముంబై, గుజరాత్ తదితర ప్రాంతాల మీదుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. డీమార్ట్, రిలయన్స్ తదితర పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు సైతం ఇక్కడి వేరుశనగ కొనుగోలుకు ఆసక్తికనబర్చడం గమనార్హం.
సాగునీటి లభ్యత పెరగడంతో..
గతంలో కేవలం జూరాల జలాశయం నుంచి మాత్రమే సాగునీరు అందేది. ప్రస్తుతం కేఎల్‌ఐ, ఘనపురం, పెద్దమందడి బ్రాంచ్ కెనాల్స్‌తో జిల్లాలోని సుమారు వెయ్యికిపైగా చెరువులను అనుసంధానం చేయడంతో జిల్లాలో సాగునీటి లభ్యత పెరిగింది. దీంతో రైతులు ఎక్కువ శాతం మెట్టపంటల నుంచి వరిసాగుకు మళ్లినట్లు తెలుస్తోంది. 2017–18 వానాకాలంలో జిల్లావ్యాప్తంగా వరిసాగు 84,077 ఎకరాలు ఉండగా.. 2024–25 వానాకాలంలో 1.84 లక్షలకు పెరిగింది. ఏడేళ్లలో ఏకంగా లక్ష ఎకరాల వరి సాగు పెరిగింది.
జిల్లాలో వేరుశనగ సాగు (ఎకరాల్లో..)
ఏడాది వానాకాలం యాసంగి
2017–18 6,061 59,446
2018–19 1,505 53,701
2019–20 3,422 43,379
2020–21 4,267 33,164
2021–22 2,782 31,654
2022–23 7,709 22,601
2023–24 5,113 18,061
కాపలాకు భయపడి..
మేము మూడేళ్ల కిందటి వరకు ఉన్న ఐదు ఎకరాల్లో వేరుశనగ సాగు చేసేవాళ్లం. దిగుబడి బాగానే వచ్చేది. కానీ రాత్రి వేళల్లో స్ప్రింక్లర్ల పైపులు మార్చాల్సి ఉంటుంది. పొలానికి వెళ్లి పనులు చేసే క్రమంలో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయోనని భయం. దీనికితోడు వేరుశనగ రేటు ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితి. దీంతో పంట మార్పిడి చేపట్టాం. ప్రస్తుతం ఏడాదికి రెండు పంటలు వరి సాగు చేస్తున్నా. ఎలాంటి ఇబ్బందులు లేవు.
– బోడోళ్ల మన్యం, రైతు, గోపాల్‌పేట
అవగాహన కల్పిస్తాం..
జిల్లాలో వేరుశనగ సాగును పెంచేందుకు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఏటా యాసంగిలో వేరుశనగ సాగు చేయడం జిల్లాలో ఆనవాయితీ. కొంతకాలంగా సాగు విస్తీర్ణం తగ్గడానికి ప్రధాన కారణం రాత్రి వేళల్లో కాపలా ఉండాల్సిన పరిస్థితులే. ప్రత్యామ్నాయ మార్గాలను సూచించే ప్రయత్నం చేస్తున్నాం.
– శివనాగిరెడ్డి, ఏడీఏ, వనపర్తి
Comments
Please login to add a commentAdd a comment