రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సహకరించండి
ఆత్మకూర్: ఆత్మకూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా మార్చి పూర్వ వైభవం తీసుకొస్తానని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం అఖిలపక్షం, రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో వందలాది మందితో కలిసి కలెక్టరేట్‌కు చేరుకొని కలెక్టర్ ఆదర్శ్ సురభిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆత్మకూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలంటూ ఇదివరకే అసెంబ్లీలో ప్రస్తావించినట్లు గుర్తుచేశారు. ఇందుకు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సానుకూలత తెలిపారని, కలెక్టర్‌కు ఆదేశాలు ఇస్తున్నట్లు వెల్లడించినట్లు చెప్పారు. కలెక్టర్ స్పందించి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సహకరించాలని, సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని కోరారు. త్వరలోనే సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment