సంబరాలు శ్రుతిమించితే జైలుకే..
ఆత్మకూర్: నూతన సంవత్సర సంబరాలు శ్రుతి మించితే జైలుకు వెళ్లడం ఖాయమని.. డిసెంబర్ 31న తప్పతాగి రోడ్లపై బీభత్సం సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ శివకుమార్, ఎస్‌ఐ నరేందర్ హెచ్చరించారు. ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎస్పీ ఆదేశాల మేరకు ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని.. ఏడాది చివరిరోజు మంగళవారం రాత్రి రోడ్లపై ఆంక్షలు విధించామన్నారు. తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేసి లైసెన్సులు రద్దు చేయిస్తామని చెప్పారు. డీజే సౌండ్లు పూర్తిగా నిషేదమని, తోటలు ఇతర ప్రాంతాల్లో గుంపులుగా చేరి కార్యక్రమాలు నిర్వహించవదన్నారు. వాట్సప్, ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్ర్ట్రాగాం, యూట్యూబ్ తదితర సామాజిక మధ్యమాల్లో మతాలు, వ్యక్తులను కించపర్చడంలాంటి పోస్టులు చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
చెరుకు టన్నుకు
రూ.4 వేలు ఇవ్వాలి
ఆత్మకూర్: రాష్ట్రవ్యాప్తంగా చెరుకు సాగు గణనీయంగా పడిపోతుందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి టి.సాగర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని వర్తకసంఘం భవనంలో చెరుకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీఎస్ గోపీ అధ్యక్షతన రైతుసంఘం జిల్లా సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల ఎకరాల్లో చెరుకు సాగవుతుండగా.. ప్రస్తుతం 30 వేల ఎకరాలకు పడిపోయిందని తెలిపారు. 11 చెరుకు ఫ్యాక్టరీలకుగాను ప్రస్తుతం 9 మాత్రమే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించకపోవడంతోనే సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోందని చెప్పారు. చెరుకు టన్నుకు రూ.4 వేల ధరతో పాటు బోనస్ రూ.వెయ్యి చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు పంట నష్టపోతే జమానత్ ఇచ్చిన రైతు నుంచి డబ్బులు వసూలు చేయడం దారుణమని ధ్వజమెత్తారు. రైతులకు నాణ్యమైన విత్తనం, పంట కోతలు, తరలింపు, 14 రోజుల్లో డబ్బుల చెల్లింపులు జరిగేలా కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చూడాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి జబ్బార్, నాయకులు బాల్‌రెడ్డి, వెంకటేష్, రాజు, వెంకట్రాములు, ప్రసాద్, బుచ్చన్న, ముని, అరుణ్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.
లక్ష డప్పులు, వెయ్యి
ప్రదర్శనలకు శ్రీకారం
మహబూబ్‌నగర్ రూరల్: మాదిగ జాతిలో పుట్టిన ప్రతిబిడ్డ ఇంటికొక డప్పుతో స్వచ్ఛందంగా తరలివచ్చి జాతి కోసం పని చేయాలని దండోరా కళా మండలి రాష్ట్ర కోఆర్డినేటర్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జి డాక్టర్ డప్పు స్వామి అన్నారు. లక్షల డప్పుల్ని తరలించే కార్యక్రమంలో భాగంగా.. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఐదు వేల మంది డప్పు కళాకారులు తరలిరావాలన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌లో జిల్లా కళా నాయకుల కవాత్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా హక్కులు సాధించుకోగలమన్నారు. జాతి కోసం, భవిష్యత్ కోసం పార్టీలకతీతంగా అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో అధ్యక్షుడిగా రొట్టె శేఖర్, ప్రధాన కార్యదర్శిగా కృష్ణ, ఉపాధ్యక్షులుగా చెన్నయ్య, ప్రవీణ్, ఝాన్సీ, సహాయ కార్యదర్శులుగా వెంకటసాగర్, వెంకటయ్య, ప్రచార కార్యదర్శిగా వెంకటయ్య, సోషల్ మీడియా ఇన్‌చార్జిగా బాలీశ్వరిలను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాయకులు సంధ్య కార్తీక్, కిరణ్, అంజన్న, జములయ్య, శ్రీరాములు, బాలయ్య, కావలి కృష్ణయ్య, సురేష్, కుర్మయ్య, మైబు, ఎర్ర నర్సింహ, బాలయ్య, ఎదిర నర్సింహ, బాలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment