వారబందీ విధానం ఎత్తివేయాలని వినతి
అమరచింత: వారబందీ విధానం ఎత్తివేసి నిరంతరం సాగునీరు ఇవ్వాలని అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ఆదివారం వినతిపత్రం అందజేశారు. మండల కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే రైతుల వినతి మేరకు ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా లిఫ్ట్ అధ్యక్షురాలు సౌజన్యారెడ్డి మాట్లాడుతూ.. జూరాల ఎడమ కాల్వకు అనుసంధానంగా ఉన్న అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులు యాసంగిలో వరితో పాటు చెరుకు సాగు చేస్తున్నారని, సాగునీరు పుష్కలంగా అందితేనే పంటలు చేతికందుతాయని వివరించారు. ఆయకట్టు మొత్తం 1,800 ఎకరాలు సాగవుతుందని.. ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి వారబందీతో సంబంధం లేకుండా సాగునీరు వదలాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ సమస్యను ముఖ్యమంత్రికి వివరించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో లిఫ్ట్ కార్యదర్శి ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment