‘ప్రజావాణి’ అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
వనపర్తి: ప్రజావాణి అర్జీలను ఆయా శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించి వారికి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి ఆయనతో పాటు అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, వెంకటేశ్వర్లు హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు జరగగా.. మొత్తం 37 అర్జీలు దాఖలైనట్లు గ్రీవెన్స్ సెల్ అధికారి శ్రీకాంత్‌రావు వివరించారు.
పోలీసు ప్రజావాణికి 15 వినతులు..
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 15 అర్జీలు దాఖలైనట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. పరిష్కారం కోసం వాటిని ఆయా ప్రాంతాల్లోని పోలీసు అధికారులకు పంపనున్నట్లు చెప్పారు. దాఖలైన వాటిలో భూ సమస్యల అర్జీలు 6, పరస్పర గొడవలకు సంబంధించి 4, భార్యాభర్తల గొడవలకు సంబంధించి 5 ఉన్నట్లు వివరించారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి
Comments
Please login to add a commentAdd a comment