స్నేహం.. కలకాలం...
పాన్‌గల్: మండలంలోని రేమద్దులలో ఉన్న ఫ్రెండ్స్ యువజన సంఘం సభ్యులు మృతిచెందిన స్నేహితుడి కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇచ్చి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సంఘం వ్యవస్థాపక సభ్యుడు ఆత్మకూరి కుర్మయ్య 5 నెలల కిందట అనారోగ్యంతో మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధిత కుటుంబానికి ఇల్లు లేకపోవడంతో నిర్మించి ఇవ్వాలని స్నేహితులు నిర్ణయించారు. రెయిన్‌బో హోమ్స్ డైరెక్టర్లు అనురాధ, అంబిక వారి ఆర్థిక తోడ్పాటుతో పాటు దాతలు, గ్రామస్తుల సహకారం, సంఘం సభ్యులు రూ.లక్ష సాయం కలిపి మొత్తం రూ.7 లక్షలతో మూడు గదులతో ఇంటి నిర్మాణం చేపట్టారు. సోమవారం సంఘం 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇంటిని ప్రారంభించి మిత్రుడి భార్య పద్మకు అప్పగించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ డా. సదాశివయ్య, రెయిన్‌బో హోమ్స్ డైరెక్టర్లు, చేయూత ఆశ్రమం నిర్వాహకుడు శ్రీని వాస్, యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి
ఇల్లు నిర్మించి ఇచ్చిన మిత్రులు
Comments
Please login to add a commentAdd a comment