న్యాయసేవలు సద్వినియోగం చేసుకోవాలి
వనపర్తి టౌన్: న్యాయస్థానాల్లో లోక్ అదాలత్ ఆధ్వర్యంలో ఇస్తున్న ఉచిత న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధికారి వి.రజిని కోరారు. సోమవారం సఖి కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చట్టం దృష్టిలో అందరూ సమానులేనని.. అందరికీ న్యాయసేవలు అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, చిన్నారులు, వృద్ధులు, రూ.3 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి, ప్రకృతి వైఫరీత్యాల బాధితులకు లోక్ అదాలత్ ద్వారా న్యాయస్థానాల్లో ఉచిత న్యాయసేవలు అందిస్తున్నామని వివరించారు. ఉచిత న్యాయ సేవలకు టోల్‌ఫ్రీ నంబర్ 15100 ఏర్పాటు చేశామని తెలిపారు. సఖి కేంద్రంలో అమలవుతున్న మహిళా సేవలను వినియోగించుకోవాలని కేంద్రం కార్య నిర్వాహకురాలు కవిత సూచించారు. కార్యక్రమంలో లోక్ అదాలత్ డిఫెన్స్ అసిస్టెంట్ కౌన్సిల్ ఎం.శ్రీదేవి, న్యాయవాదుల సేవా సంఘం ఉపాధ్యక్షుడు డి.కృష్ణయ్య, సఖికేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment