కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
ఆత్మకూర్: పట్టణ శివారులోని మల్లాపురంలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం వేదపండితులు వెంకటశేషశర్మ, సుబ్రమణ్యస్వామి ఆధ్వర్యంలో దేవత ఆహ్వానం, విశ్వక్సేన, పుణ్యాహ వాచనం, అంకురార్పణ, కలశస్థాపన, అష్టదిక్పాలక తదితర పూజా కార్యక్రమాలు, గణపతి హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం అష్టోత్తర కలశాలతో మహాస్నాపనం, అర్చన, నత్యహోమం, 3న సుదర్శన, లక్ష్మీ హోమం, వేద పారాయణం తదితర పూజలు, 4న స్వామివారి కల్యాణం, రథోత్సవం, 5న చక్రస్నానం, సుబ్రమణ్య, అయ్యప్పలకు అభిషేకం, పుష్పయాగం, మంగళశాసనం, ధ్వజావరోహణం, స్వస్తి వాచకం, కర్తలకు శేషవస్త్రాలతో వేదాశిస్సులు తదితర పూజ కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment