కిటకిటలాడిన కోటిలింగేశ్వరస్వామి ఆలయం
పామాపురం ఊకచెట్టు వాగులో ఉన్న భారీ శివుడి విగ్రహం వద్ద జనం
కొత్తకోట రూరల్: నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం మండలంలోని కానాయపల్లి స్టేజీ సమీపంలో ఉన్న దత్త కోటిలింగేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ధ్యానమందిరంలో ప్రతిష్టించిన పాదరస సహిత నవరత్నాలంకృత స్వర్ణ కవచ పంచలోహ శివలింగాన్ని దర్శించుకున్నారు. పూజల అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
● నూతన సంవత్సరం సందర్భంగా మండలంలోని పామాపురం, రామకృష్ణాపురం శివారులోని రామేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ సమీపంలోని ఊకచెట్టువాగులో ఏర్పాటు చేసిన భారీ శివుడి విగ్రహం దగ్గర పర్యాటకులు చిన్నా పెద్దా లేకుండా సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment