సంక్షేమ సర్వే షురూ
లబ్ధిదారుల ఎంపికకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న అధికారులు
●
వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం రోజున ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డుల మంజూరుకు సన్నద్ధమవుతోంది. జిల్లా ఉన్నతాధికారులతో పాటు రెవెన్యూ, వ్యవసాయ, గృహ నిర్మాణశాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే చేపడుతూ లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. 20వ తేదీలోపు సర్వే ప్రక్రియ పూర్తిచేసి.. 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రెవెన్యూ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అర్హుల జాబితాను రూపొందించనున్నారు. ఈ నెల 25న అర్హుల జాబితాకు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. శుక్రవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఖిల్లాఘనపురం మండలం రైతుభరోసా సర్వే ప్రక్రియను పరిశీలించారు. సాగుకు యోగ్యమైన భూమికే పరిహారం అందించాలనే లక్ష్యంతో శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములు, గుట్టలు, కాల్వలు, ప్లాట్లు ఇళ్లు తదితర ప్రాంతాలను గుర్తిస్తున్నారు. ధరణి ఫోల్టర్‌లో నమోదైన భూముల వివరాల ఆధారంగా సర్వే చేపడుతున్నట్లు తెలుస్తోంది.
నాలుగు అంశాలపైనే ప్రధాన పర్యవేక్షణ..
రెవెన్యూ గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని భూ భారతి, ధరణి ఫోల్డర్ సాఫ్ట్‌వేర్ నుంచి ఆర్‌ఓఆర్ రికార్డును తీసుకొని రెవెన్యూ, మండల పరిషత్, అగ్రికల్చర్ అధికారులు తుది సర్వేను నిర్వహించి జాబితాను సిద్ధం చేయనున్నారు. గృహాలు, కాలనీలుగా మారిన వ్యవసాయ భూములు, రియల్ ఎస్టేట్ లేఅవుట్లు, పరిశ్రమలు, సాగునీటి కాల్వలకు కేటాయించిన భూములు, ప్రభుత్వ అవసరాలకు సేకరించిన భూములు, సాగుకు యోగ్యంగా లేని భూములను గుర్తిస్తున్నారు.
జిల్లాలో సాగుభూమి 2.69 లక్షల ఎకరాలు..
వ్యవసాయశాఖ వెల్లడించిన తాజా లెక్కల ప్రకారం జిల్లాలో 2.69 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ఏటా వర్షాకాలంలో ఇంతకుమించిన విస్తీర్ణంలో వరితో పాటు వివిధ రకాల పంటలు సాగు చేస్తారు. దీనికితోడు పండ్లు, కూరగాయల తోటలు, ఆయిల్‌పాం తదితర ఉద్యాన పంటలకు సైతం రైతుభరోసా ఇవ్వాల్సి ఉంది. అర్హుల జాబితాను సిద్ధం చేసేందుకు గ్రామసభల నిర్వహణకు ఇప్పటికే అధికారులు షెడ్యూల్ రూపొందించారు. గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడో ఏర్పాటు చేసిన ప్లాట్లు, పెట్రోల్ పంపులు, భవంతులు, మైనింగ్ అనుమతి పొందిన భూములకు కొన్నిచోట్ల పెట్టుబడి సాయం అందించారు. అలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా అర్హులకే రైతుభరోసా అందించాలని కసరత్తు చేస్తున్నారు.
సర్వే ప్రక్రియ కొనసాగుతోంది..
గణతంత్ర దినోత్సవం రోజున ప్రారంభం కానున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారుల ఎంపికకు జిల్లావ్యాప్తంగా అధికారులు సర్వే చేపడుతున్నారు. 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యే గ్రామసభల్లో లబ్ధిదారుల జాబితా సిద్ధం కానుంది. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఆమోద ముద్ర పడగానే పథకం వర్తిస్తుంది.
– శివనాగిరెడ్డి,
ఏడీఏ, జిల్లా వ్యవసాయశాఖ
గణతంత్ర దినోత్సవం రోజున
నాలుగు పథకాల అమలుకు శ్రీకారం
శాటిలైట్ మ్యాపింగ్‌తో
సాగు భూముల గుర్తింపు
ఈ నెల 21 నుంచి గ్రామసభలు
25న తుదిజాబితాపై
ఇన్‌చార్జ్ మంత్రి ఆమోద ముద్ర
Comments
Please login to add a commentAdd a comment