![సమావేశంలో కలెక్టర్ సిక్తా, ఇతర అధికారులు
- Sakshi](/styles/webp/s3/article_images/2023/11/11/10hmkd178-330089_mr_0.jpg.webp?itok=Dno7M3QA)
సమావేశంలో కలెక్టర్ సిక్తా, ఇతర అధికారులు
వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య
కరీమాబాద్: ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వరంగల్ ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝాతో కలిసి కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు షణ్ముఖరాజన్, పోలీసు పరిశీలకుడు రాజేశ్‌కుమార్, వ్యయ పరిశీలకుడు అమిత్ ప్రతాప్‌సింగ్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ వివరించారు. ఇందులో ఆర్‌ఓలు రిజ్వాన్‌బాషా, అశ్విని తానాజీ, ఎన్నికల నోడల్ అధికారులు, పర్యవేక్షకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకు కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద సీపీ, కేంద్ర ఎన్నికల పరిశీలకులతో కలిసి కలెక్టర్ ఫొటోలు దిగారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వర్ధన్నపేట, తూర్పు నియోజకవర్గాల ప్రజలు ఎన్నికలకు సంబంధించి 63022 62778, 93904 41371 కు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.
అర్బన్‌లో ఓటింగ్ పెరిగేలా చర్యలు
హన్మకొండ అర్బన్: మిషన్–29లో భాగంగా అర్బన్ ప్రాంతంలో ఓటింగ్ శాతం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎన్నికల అధికారి సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో అర్బన్ ఓటింగ్ శాతం తక్కువగా ఉందని దాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ శ్రద్ధా శుక్ల, అధికారులు పాల్గొన్నారు.
పుష్పగుచ్ఛం అందజేత
జిల్లాకు పోలీస్ పరిశీలకులుగా వచ్చిన సీనియర్ ఐపీఎస్ అధికారి తోగో ఖర్గాను కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం కలెక్టరేట్‌లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
![మాట్లాడుతున్న వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య1](https://www.sakshi.com/gallery_images/2023/11/11/10wgl176-330155_mr.jpg)
మాట్లాడుతున్న వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య
![2](https://www.sakshi.com/gallery_images/2023/11/11/jungtelangana_mr_12.jpg)
Comments
Please login to add a commentAdd a comment