![వీరభద్రస్వామి–భద్రకాళిదేవికి నాగవెల్లి,
పుష్పయాగం - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/17/94efe800-0409-4cff-b746-0ab7f3673425_mr_1.jpg.webp?itok=bzT1DhVJ)
వీరభద్రస్వామి–భద్రకాళిదేవికి నాగవెల్లి, పుష్పయాగం
పుష్పోత్సవం, సప్తవర్ణాల ఏకాంత సేవ
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం కొత్తకొండ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం వీరభద్రస్వామి–భద్రకాళిదేవికి ఆలయ అర్చకులు నాగవెల్లి, పుష్పయాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో భాగంగా వసంత మండపంలో నీలలోహిత పూజ చేసి నల్లపూసలను భద్రకాళి అమ్మవారికి ధరింపజేశారు. అనంతరం పుష్పోత్సవం, సప్తవర్ణాల ఏకాంత సేవ నిర్వహించారు. అనంతరం భక్తులు భద్రకాళి సమేత వీరభద్రస్వామిని దర్శించుకున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, వరంగల్ జోన్ ఉప కమిషనర్ శ్రీకాంత్‌రావు స్వామి వారిని దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. జాతరలో భక్తుల సౌకర్యార్థం అవసరమైన సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కిషన్‌రావు, ముఖ్య అర్చకులు సదానందం, ఉప ప్రధాన అర్చకులు రాజయ్య, రాంబాబు, అర్చకులు శ్రీకాంత్, వీరభద్రయ్య, రమేష్, శివకుమార్, చరత్‌చంద్ర, శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment