మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
సంగెం: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషిచేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న పోస్ట్‌మెట్రిక్ గిరిజన బాలుర వసతి గృహాన్ని మహిళల ఆర్థిక సాధికారత వీ–హబ్ సీఈఓ సీత పళచోళ్ల బృందంతో కలిసి గురువారం ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంగెం, గీసుకొండ మండలాలకు ఒక మహిళా ఆర్థిక సాధికారత సెంటర్ కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబును కోరిన వెంటనే వీ–హబ్ సీఈఓతోపాటు బృందాన్ని పరిశీలనకు పంపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వీ–హబ్ సీఈఓ సీత పళచోళ్ల మాట్లాడుతూ మహిళలు చైతన్యవంతులై అన్ని రంగాల్లో ముందుకు వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సీఎం వీ–హబ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఉండడం ఈ ప్రాంత మహిళల అదృష్టమని పేర్కొన్నారు. తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీఓ రవీందర్, పీఆర్ డీఈ జ్ఞానేశ్వర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్, వీ–హబ్ అధికారులు పాల్గొన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment