అమీనాబాద్‌లో షార్ట్ సర్క్యూట్
చెన్నారావుపేట: మండలంలోని అమీనాబాద్ షార్ట్ సర్క్యూట్ జరిగి రూ.26 లక్షల సామగ్రి దగ్ధమైన ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పోతరాజు మహేశ్ టెంట్ హౌస్, డీజే, డెకరేషన్స్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మహేశ్ తండ్రి కొమురయ్య అనారోగ్యానికి గురై హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో మహేశ్ తండ్రితోపాటు ఆస్పత్రిలోనే ఉన్నాడు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగింది. మంటలు చెలరేగి ఇంట్లో ఉన్న టెంట్లు, డీజే బాక్సులు, సౌండ్ సిస్టంలు, సుమారు 600 కుర్చీలు, డెకరేషన్ వస్తువులు మొత్తం కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో వచ్చి మంటలను అదుపుచేశారు. సుమారు రూ.26 లక్షల విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలని వారు కోరారు.
టెంట్లు, డీజే డెకరేషన్ సామగ్రి దగ్ధం
రూ.26 లక్షల ఆస్తి నష్టం
Comments
Please login to add a commentAdd a comment