వరంగల్: జిల్లాలో నిర్వహిస్తున్న మైనింగ్, మూసివేసిన మైనింగ్ ఏజెన్సీల వివరాలను అందించాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం మైనింగ్ టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తహసీల్దార్లు, పోలీస్ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారుల సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు నివేదికలు సమర్పించని అధికారులతో సమీక్ష నిర్వహించి నివేదికలు సమర్పించాలన్నారు. అదేవిధంగా గురుకులాలు, సంక్షేమ వసతిగృహాల్లో శనివారం నిర్వహించనున్న డైట్ చార్జీల పెంపు ప్రత్యేక కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించాలని తహసీల్దార్లను ఆదేశించారు. సమావేశంలో మైనింగ్ ఏడీ రవిశంకర్, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment