మిల్లర్ల దోపిడీని అరికట్టాలి
సంగెం: ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల దోపిడీని అరికట్టాలని అఖిల భారత కిసాన్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం చింతలపల్లిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతుల నుంచి హమాలీ డబ్బులు వసూలు చేస్తున్నారని, బస్తాకు 40 కిలోలకు బదులు రెండున్నర కిలోలు అదనంగా కాంటా వేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే దోపిడీని అరికట్టి రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. నాయకులు గోనె రాంచందర్, రౌతు శ్రీనివాస్, జక్కా అశోక్, సోమిడి రవి, ఐలయ్య, ఎనబోతుల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment