ఇంటర్ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
● డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్
కాళోజీ సెంటర్: జిల్లాలో మార్చిలో నిర్వహించనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ ఆదేశించారు. వరంగల్ నగరంలోని ప్రైవేట్ కళాశాలలు, పరీక్ష కేంద్రాలను శుక్రవారం ఆయన సందర్శించి వసతులను పరి శీలించారు. వార్షిక పరీక్షలకు గదుల్లో డ్యూయల్ డెస్కులు, గాలి, నీరు, విద్యుత్, ఫ్యాన్లు, సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా అని పరిశీలించారు. పరీక్షల నిర్వహణకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, సిలబస్ పూర్తిచేసి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment