పరకాలను సమష్టిగా అభివృద్ధి చేద్దాం
వరంగల్: హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధిలో ఉన్న పరకాల నియోజకవర్గాన్ని సమష్టిగా అభివృద్ధి చేద్దామని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. వరంగల్ కలెక్టరేట్‌లో శుక్రవారం వివిధ అభివృద్ధి పనులపై వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్య శారద, పి.ప్రావీణ్యతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సోలార్‌పవర్ ప్లాంట్లు, డెయిరీఫాంలు ఏర్పాటు చేయాలని, కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కులో ఉపాధి కోసం మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్లను కోరారు. ఊకల్, సంగెం, కాపులకనపర్తి సొసైటీ సభ్యులు ములుకనూరు డెయిరీ సందర్శించారని, దాదాపు 20 వేల మంది మహిళలు విజయవంతంగా డెయిరీ ఫాం నడిపిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలో డెయిరీ ఫాం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. వరంగల్ కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ జనవరి 7న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో కుట్టుశిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, ఇందుకోసం నియోజకవర్గంలో 500 మంది మహిళలను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు జిల్లాలో పాడి గేదెల నివేదికలను సేకరించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, పరకాల ఆర్డీఓ డాక్టర్ నారాయణ, వరంగల్, హనుమకొండ డీఆర్డీఓలు కౌసల్యాదేవి, మేన శ్రీనివాస్, ఎల్‌డీఎం రాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
రెండు జిల్లాల అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
హాజరైన హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారద
Comments
Please login to add a commentAdd a comment