కోడెల విక్రయాలపై విచారణ చేపట్టాలి
గీసుకొండ: వేములవాడ రాజన్న కోడెల విక్రయాలపై జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని, ఈ వ్యవహారంలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్న మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని బీజేపీ పరకాల నియోజకవర్గ ముఖ్యనాయకులు డాక్టర్ కాళీప్రసాద్, డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన శాఖ తప్పిదాలను బయట పడనీయకుండా మంత్రి కొండా సురేఖ రాష్ర ప్రజలను మభ్యపెట్టే పనిలో ఉన్నారని పేర్కొన్నారు. అన్యమతస్తుడు రాంబాబుకు కోడెలను ఇవ్వాలంటూ మంత్రి సురేఖ సిఫారసు చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టేనని అన్నారు. కోడెల అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసిన బీజేపీ, వీహెచ్‌పీ నాయకులను చంపుతామని పలువురు కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారికి తాము రక్షణగా ఉంటామని, ఏమైనా అయితే ఊరుకోమని హెచ్చరించారు. బీజేపీ మండల అధ్యక్షుడు జాన్‌విక్రం, పరకాల నియోజకవర్గ కన్వీనర్ ముల్క ప్రసాద్, నాయకులు కక్కెర్ల శ్రీనివాస్, రాజు, ల్యాద రాజేశ్, కొంగర రవి, అఖిల్, వెంకన్న, రాజిరెడ్డి, సాంబరాజు బాలరాజు, రాము, ప్రదీప్ ఉన్నారు.
బీజేపీ నాయకులు డాక్టర్ కాళీప్రసాద్, డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment