ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేయండి
మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: వాహన మరమ్మతుల్లో జాప్య నివారణకు ప్రత్యేకంగా యాప్ (అప్లికేషన్) రూపొందించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. ఈనెల 10న సాక్షిలో ప్రచురితమైన ‘ఆగని ఇంధన దోపిడీ’ కథనానికి మేయర్ స్పందించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బల్దియా వెహికిల్ షెడ్డును మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ మాట్లాడుతూ.. సమగ్ర చెత్త సేకరణ పూర్తి స్థాయిలో జరగాలంటే.. రవాణా వ్యవస్థ సక్రమంగా ఉండాలన్నారు. అందుకోసం వెహికిల్ ట్రాకింగ్ యంత్రాలను సమకూర్చాలని ఆదేశించారు. ఆమె వెంట ఎస్‌ఈ ప్రవీణ్ చంద్ర తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment