కామన్‌ మెన్యూ | - | Sakshi
Sakshi News home page

కామన్‌ మెన్యూ

Published Sat, Dec 14 2024 1:03 AM | Last Updated on Sat, Dec 14 2024 1:03 AM

కామన్

కామన్‌ మెన్యూ

పెరిగిన డైట్‌ చార్జీలు (రూ.లలో)

తరగతులు ప్రస్తుత పెంపు

చార్జీలు అనంతరం

3వ నుంచి 7వ 950 1,330

8 నుంచి 10 1,100 1,540

ఇంటర్‌, ఆపైన 1,500 2,100

కాస్మొటిక్‌ చార్జీలు (బాలికలు)

3 నుంచి 7వ 55 175

8 నుంచి10 75 275

కాస్మొటిక్‌ చార్జీలు (బాలురు) హెయిర్‌ కటింగ్‌ చార్జీలు కలిపి

3 నుంచి 7 62 150

8 నుంచి 10 62 200

న్యూశాయంపేట:ఉమ్మడి జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సాధారణ గురుకులాలు, వసతి గృహాల్లో శనివారం నుంచి కామన్‌ మెనూ అమల్లోకి రానుంది. పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ఇటీవల ప్రభుత్వం 40శాతం మేర డైట్‌, కాస్మొటిక్‌ చార్జీలు పెంచింది. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న గురుకులాల వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నాణ్యమైన భోజనం, సరుకులు విద్యార్థులకు అందేలా జిల్లా స్థాయిలో ప్రత్యేక విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ వేసి పర్యవేక్షిస్తోంది. అంతేకాకుండా క్లాస్‌రూమ్స్‌, లైబ్రరీ, మోడ్రన్‌ డైనింగ్‌, కిచెన్‌, వాటర్‌ ఫిల్టర్లు ఉండేలా ప్రణాళికలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

నేడు సహపంక్తి భోజనాలు

గురుకులాల్లో మెరుగైన వసతులే లక్ష్యంగా ప్ర జాప్రతినిధులు పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే డైట్‌, కాస్మొటిక్‌ చార్జీలు పెంచిన నేపథ్యంలో శనివారం నుంచి అన్ని గురుకులాల్లో కామన్‌ మెనూ అమల్లోకి రానుంది. మొదటి రోజు ప్రజాప్రతినిధులు, అధికారులు కామన్‌ మెనూ ను గురుకులాల్లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సహపంక్తి భోజనాలు చేస్తారు. విద్యావ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వ చర్యలుంటాయని, ఆ దిశగా ముందుకు సాగుతున్నట్లు సంక్షేమశాఖల అధికారులు చెబుతున్నారు.

డైట్‌, కాస్మొటిక్‌ చార్జీలు 40 శాతం పెంపు

నేడు లాంఛనంగా ప్రారంభం

విద్యార్థులతో ప్రజాప్రతినిధుల

సహపంక్తి భోజనం

మెరుగైన వసతులే లక్ష్యంగా

ప్రభుత్వం అడుగులు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇలా..

మైనార్టీ గురుకులాలలు 16

విద్యార్థులు 6,200

బీసీ గురుకులాలు ... 43

విద్యార్థులు 23,000

సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులాలు(భద్రాద్రిజోన్‌) సంఖ్య

బాలికలు 17

బాలురు 17

డిగ్రీ గురుకులాలు 04

విద్యార్థులు 19,000

గిరిజన గురుకులాలు 33

డిగ్రీ కళాశాలలు 05

విద్యార్థులు 8,000

విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుంది..

డైట్‌చార్జీలు పెంచడంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుంది. గురుకులాల్లో ప్రతీ నెల నాలుగు రోజులు చికెన్‌, రెండు రోజులు మటన్‌ అందిస్తారు. మిగతా రోజుల్లో ఉడకబెట్టిన గుడ్డు కూడా అందిస్తారు. పండ్లు, స్నాక్స్‌ తదితర బలవర్ధక ఆహారాన్ని అందించడానికి వీలు కలుగుతుంది.

– టి.రమేశ్‌, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి

కామన్‌ మెనూను స్వాగతిస్తున్నాం..

అన్ని సంక్షేమ, వసతి గురుకులాల్లో కామన్‌ మెనూ, డైట్‌ విధానాన్ని స్వాగతిస్తున్నాం. ఈ విధానంతో పూర్తిస్థాయిలో విద్యార్థులకు పౌష్టికాహరం అందుతుంది. 8 ఏళ్ల తర్వాత డైట్‌ చార్జీలు పెంచడంతో విద్యార్థులకు లాభం జరుగుతుంది. వెండర్స్‌కి రేట్లు పెంచకుండా ఇప్పటి రేట్లు అమలు చేయాలి.

– జంగా సతీశ్‌, ప్రిన్సిపాల్‌ (హనుమకొండ, బి1) మైనార్టీ గురుకులం, హనుమకొండ

No comments yet. Be the first to comment!
Add a comment
కామన్‌ మెన్యూ1
1/4

కామన్‌ మెన్యూ

కామన్‌ మెన్యూ2
2/4

కామన్‌ మెన్యూ

కామన్‌ మెన్యూ3
3/4

కామన్‌ మెన్యూ

కామన్‌ మెన్యూ4
4/4

కామన్‌ మెన్యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement