సహకారం
గీసుకొండ: మండలంలోని మరియపురంను జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దిన మాజీ సర్పంచ్, నిర్మల బైండింగ్ వర్క్స్ అధినేత అల్లం బాలిరెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం స్వగ్రామంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలోని సెయింట్ జాన్స్ ఉన్నత పాఠశాల బోధన, బోధనేతర సిబ్బందికి దుస్తుల కోసం బాలిరెడ్డి రూ.35 వేలు అందించారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వే తనిఖీ
దుగ్గొండి: మండలంలోని శివాజినగర్‌లో ఇందిరమ్మ ఇళ్ల ఇంటింటి సర్వేను ఎంపీడీఓ లెక్కల అరుంధతి బుధవారం తనిఖీ చేశారు. ఇంటింటికి వెళ్లి యాప్‌లో వివరాల నమోదు, ఇంటి పరిస్థితి, స్థలం వివరాల నమోదును జీపీఆర్‌ఎస్ ఫొటో తీస్తున్నారా.. లేదా.. అనే విషయాలను పరిశీలించారు. సర్వేలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎంపీఓ శ్రీధర్‌గౌడ్, పంచాయతీ కార్యదర్శి రజిని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment