కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్
దుగ్గొండి: రాష్ట్రంలో 40 లక్షల సభ్యత్వాలు నమోదు చేసుకుని తిరుగులేని శక్తిగా బీజేపీ అవతరించిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ అన్నారు. సభ్యత్వ నమోదు, బూత్ అధ్యక్షుల నియామకంలో భాగంగా వెంకటాపురంలో శనివారం రాత్రి సమావేశం నిర్వహించారు. 21, 22 బూత్‌ల్లో చురుకుగా పనిచేసిన పొగాకు విఘ్నేశ్, పొగాకు దేవేందర్‌కు నియామకపత్రాలు అందించారు. అనంతరం జరిగిన సమావేశంలో రవికుమార్ మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేందుకు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, మండల అధ్యక్షుడు నేదురు రాజేందర్, గుడిపూడి రాధాకృష్ణ, గడ్డం ఆంజనేయులు, చిలుపూరి రాజు, నూతనకంటి శ్రీనివాస్, రమేశ్, రామ్మోహన్, పొగాకు శ్రీనివాస్, ఏరుకొండ కర్ణాకర్, లింగాచారి, నర్సింగరావు, చిరంజీవి, బూత్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment