వైభవంగా అయ్యప్ప పంబారట్టు
సంగెం: అయ్యప్పస్వామి శరణుఘోషతో మొండ్రాయి మార్మోగింది. గ్రామంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కమిటీ ఆధ్వర్యంలో కేసముద్రం శ్రీదర్మశాస్తా దేవాలయ ప్రధాన తంత్రి గురుస్వామి విష్ణునారాయణ్ పొట్టి నగర సంకీర్తన, పంబారట్టు కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఎల్గూర్‌రంగంపేట చెరువు మత్తడి వద్ద అభిషేకాలు, పంబారట్టు జరిపారు. అనంతరం అయ్యప్ప స్వాములు, భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. స్వాములు ఇజ్జగిరి అశోక్, మామిండ్ల రమేశ్, భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment