రాష్ట్రస్థాయి గణిత టాలెంట్ టెస్ట్‌కు విద్యార్థుల ఎంపిక
కాళోజీ సెంటర్: రాష్ట్రస్థాయి గణిత టాలెంట్ టెస్టు కు జిల్లా నుంచి 9 మంది విద్యార్థులు ఎంపికై నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. తెలుగు మీడియంలో రాయపర్తి మండలం కొలనుపల్లి జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి ఎల్.రాంచరణ్, ఖిలావరంగల్ శంభునిపేట జీహెచ్‌ఎస్ నుంచి ఆఫ్రీన్, గీసుకొండ మండలం వంచనగిరి జెడ్పీహెచ్‌ఎస్ నుంచి జి.భరత్, ఇంగ్లిష్ మీడియంలో ఖానాపురం సైనిక్ స్కూ ల్ విద్యార్థి ఎ.రాజ్‌కుమార్, నెక్కొండ మండలం తెలంగాణ గురుకుల పాఠశాల నుంచి ఆర్.హర్షిణి, సీహెచ్.శ్రీజ, వరంగల్ మండలం నరేంద్రనగర్ ప్ర భుత్వ పాఠశాల నుంచి పి.విశ్వతేజ, వరంగల్ మట్టెవాడ జీహెచ్‌ఎస్ నుంచి ఎస్.రష్మిక, సంగెం మండలం మొండ్రాయి జెడ్పీహెచ్‌ఎస్ నుంచి ఎ.దీపిక ఎంపికై నట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో ఆదివారం జరిగే రాష్ట్రస్థాయి గణిత టా లెంట్ టెస్ట్‌కు వీరు హాజరుకానున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment