యాదాద్రి ఆలయ స్వర్ణతాపడానికి రూ.5లక్షల విరాళం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ దివ్య విమానగోపురానికి స్వర్ణతాపడం కోసం హనుమకొండకు చెందిన వాకా సత్యనారాయణ, జయలలిత దంపతులు ఆదివారం రూ.5,01,116 లక్షల విరాళం అందజేశారు. శ్రీస్వామిని దర్శించుకున్న అనంతరం దేవస్థానం ఈఓ కార్యాలయంలో అధికారులకు నగదు అందజేశారు.
సర్వే పూర్తి చేయాలి
కాజీపేట: ఇందిరమ్మ ఇళ్ల సర్వే సకాలంలో పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కాజీ పేట 61వ డివిజన్ ప్రశాంత్‌నగర్, వడ్డేపల్లి కా లనీల్లో సర్వేను ఆదివారం ఆకస్మికంగా పరి శీలించారు. డిప్యూటీ కమిషనర్ జి.రవీందర్, హరినాఽథ్, డీఈ సిద్ధార్థనాయక్ పాల్గొన్నారు.
నేడు గ్రేటర్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తామని, సమస్యల పరిష్కారానికి ఈ వేదికను ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని సూచించారు.
30న కౌన్సిల్ సమావేశం
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగర పాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) కౌన్సిల్ సమావేశం ఈనెల 30న నిర్వహిస్తున్నట్లు సెక్రటరీ అంకమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగే సర్వసభ్య సమావేశంలో పలు ఎజెండాల్లో అంశాలపై చర్చ జరుగుతుందని, కమిషనర్, ఎక్స్ అఫీషి యో సభ్యులు, కార్పొరేటర్లు, వింగ్ అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.
పరిశోధన పత్రం సమర్పణ
విద్యారణ్యపురి: జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్‌టీలో ఈనెల 21న నిర్వహించిన రాష్ట్రస్థాయి మేథమెటిక్స్ సెమినార్‌లో కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ పోగుల అశోక్ పరిశోధన పత్రం సమర్పించారు. (పేపర్ ప్రజెంటేషన్) ‘ఎన్ హాన్సింగ్ క్వాలిఫికేషన్ టెక్నిక్స్ ఇన్ సెకండరీ స్కూల్స్ స్టూడెంట్స్ త్రూ వేదిక్ మేథమెటిక్స్’ అంశంపై పరిశోధన పత్రం సమర్పించారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ గాజర్ల రమేశ్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. ఇదిలా ఉండగా.. పోగుల అశోక్ వచ్చే నెలలో జాతీయ స్థాయిలో జరగబోయే విద్యా సదస్సులోనూ పాల్గొనేందుకు ఇప్పటికే ఆయనకు అవకాశం లభించింది. జాతీయ సదస్సుకు ఎంపికై న పోగుల అశోక్‌ను విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి ఈసందర్భంగా అభినందించారు.
కేయూలో ఐసెట్
కార్యాలయానికి సీల్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాలలోని ఐసెట్ కార్యాలయానికి రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి తాళం వేసి సీల్ చేశారు. 12 ఏళ్లుగా కాకతీయ యూనివర్సిటీయే టీఎస్‌ఐసెట్ నిర్వహించిన నేపథ్యంలో ఆ కళాశాలలో ప్రత్యేకంగా ఒక హాల్‌ను కార్యాలయంగా ఏర్పాటుచేసి అవసరమైన ఫర్నిచర్, టేబుళ్లు, కంప్యూటర్లు తదితర సామగ్రిని సమకూర్చారు. ఈసారి ఐసెట్ నిర్వహణను ఉన్నత విద్యామండలి కేయూకు అప్పగించకపోవడంతో ఐసెట్ కార్యాలయం నిరుపయోగంగా మారింది. ఈ కార్యాలయం నుంచి రెండు చైర్లు ఎవరో బయటికి తీసుకెళ్లారని ఆరోపిస్తూ రెండురోజుల క్రితం ఒకరు రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. దీంతో ఆయన కళాశాలను సందర్శించి ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్కడ స్టాక్ రిజిస్టర్ మెయింటేన్ చేయడంలేదనేది గుర్తించిన రిజిస్ట్రార్.. ప్రస్తుతం ఉన్న ఫర్నిచర్ రిజిస్టర్‌లో పొందుపరిచి కార్యాలయానికి తాళం వేయించారు. అందులోని వస్తువుల జాబితా పత్రాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అమరవేణికి అందజేసినట్లు ఆదివారం వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment