అల్లు అర్జున్ వ్యవహార శైలి సిగ్గుచేటు
హన్మకొండ చౌరస్తా: తొక్కిసలాటలో ఓ తల్లి ప్రాణా లు కోల్పోయి, బిడ్డ చావుబతుకుల మధ్య ఉంటే కనీసం పశ్చాత్తాపం లేకుండా అల్లు అర్జున్, ఆయన తండ్రి అరవింద్ మాట్లాడుతున్న తీరు సిట్టుచేటని కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండ డీసీసీ భవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాధిత కుటుంబానికి తక్షణ సాయం ప్రకటించకుండా తనను అవమానిస్తున్నారంటూ మాట్లాడడం సరికాదన్నారు. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లుగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పాప్ కార్న్‌పై 12 శాతం జీఎస్‌టీ విధిస్తే బండి సంజయ్‌కి సోయే లేదని విమర్శించారు. రెండు సార్లు మంత్రి పదవి, పీసీసీ చీఫ్ పదవులు అనుభవించిన ఓ పెద్ద మనిషి, కబ్జా చేసి నిర్మించిన పార్టీ ఆఫీసులో కూర్చుని కాంగ్రెస్‌ను విమర్శించడం వలన ఆయనపై ఉన్న గౌరవం పోయిందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ చేసిన అక్రమాల కేసుల్లో వారిని భగవంతుడు కూడా కాపాడలేదని అన్నారు. తమకు అందరూ సమానమేనని తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. సమావేశంలో వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, వేముల శ్రీనివాస్, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ బొమ్మతి విక్రమ్, పల్లకొండ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment