మార్కెట్‌లో ఆకస్మిక తనిఖీ
హన్మకొండ: హనుమకొండ, కాజీపేటలోని కూరగాయలు, చికెన్, ఫిష్ మార్కెట్‌లను తూనికలు, కొలతల శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని కూరగాయల మార్కెట్, ఎకై ్సజ్ కాలనీలోని రైతు బజార్, కాజీపేటలోని కూరగాయలు, ఫిష్ మార్కెట్‌ను సిబ్బందితో కలిసి హనుమకొండ జిల్లా తూనికలు, కొలతల అధికారి శ్రీలత తనిఖీ చేశారు. కాంటాలు, బాట్లు పరిశీలించారు. 30 మంది వ్యాపారుల షాపులను తనిఖీ చేశారు. స్టాంపులు లేని బాట్లు స్వాదీనం చేసుకున్నారు. స్టాంపులు వేయించుకోకుండా వేయింగ్ మిషన్‌లు వాడుతున్న ఇద్దరు చికెన్, ఒక ఫిష్ వ్యాపారి నుంచి రూ.5 వేలు జరిమానా వసూలు చేశారు. ప్రతీ వ్యాపారి దగ్గరకు వెళ్లి కాంటాలు, తూనికల రాళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. బరువులో తేడా, కాంటాల్లో మోసాన్ని పరిశీలించారు. వినియోగదారులను మోసం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాపారులు నిబంధనలు పాటించాలని సూచించారు. ఏటా తమ తూనికల రాళ్లకు, వేయింగ్ మిషన్లకు స్టాంపులు వేయించుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించకుండా కాంటాలు, వేయింగ్ మిషన్లు, బాట్లు వాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మూడు కేసులు నమోదు
వ్యాపారులకు జరిమానా
Comments
Please login to add a commentAdd a comment