‘సఖి’తో చైతన్యం
కాజీపేట అర్బన్: ఆపదలోని మహిళలకు ఆత్మస్థైర్యం అందించేందుకు తమకు కేటాయించిన చట్టాలపై అవగాహన కల్పించేందుకు, సఖి సేవలపై వన్‌స్టాప్ సెంటర్ అవగాహన సదస్సులను నిర్వహిస్తూ మహిళలను సఖి సిబ్బంది చైతన్యపరుస్తున్నారు. ఆపదలో ఉన్న మహిళలకు మేమున్నామంటూ మనోధైర్యాన్ని కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది సఖి. అన్ని రకాల సమస్యల పరిష్కారానికి కేరాఫ్‌గా నిలుస్తున్న సఖి సేవలను వినియోగించుకోవాలని సిబ్బంది కోరుతున్నారు.
1,116 అవగాహన సదస్సులు
సఖి వన్‌స్టాప్ సెంటర్ హనుమకొండలోని ఎకై ్సజ్ కాలనీలో సీ్త్ర, శిశు సంక్షేమశాఖ, సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 2017లో ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు పాఠశాల, కళాశాల, మహిళా సంఘాల్లో 1,116 అవగాహన సదస్సులు నిర్వహించారు. కాగా.. అవగాహన సదస్సుల అనంతరం మహిళలు, బాలికలు తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సఖి వన్‌స్టాప్ సెంటర్‌ను ఆశ్రయించారు. ఇందులో భాగంగా 2,140 వివిధ రకాల సమస్యలతో కేసులు రాగా.. 1,648 కేసులు పరిష్కరించారు. మిగతా కేసులు విచారణలో ఉన్నాయి.
చట్టాలపై అవగాహన సదస్సులు
టోల్‌ఫ్రీతో 24 గంటల సేవలు
Comments
Please login to add a commentAdd a comment