రౌడీషీటర్లతో కఠినంగా ఉండాలి
● సీపీ అంబర్ కిషోర్ ఝా
ఖిలా వరంగల్: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే రౌడీషీటర్లతో పోలీసులు కఠినంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌ను డీసీపీ రవీందర్, ఏసీపీ నందిరామ్‌నాయక్‌తో కలిసి సీపీ తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పోతీస్ స్టేషన్‌లో రిసెప్షన్ కౌంటర్ సేవలు, సిబ్బంది పనితీరు, రికార్డులు, పరిసరాలను ఆయన పరిశీలించారు. ఫిర్యాదుదారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని ఇన్‌స్పెక్టర్ వెంకటరత్నంను సీపీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడారు. శాంతిభద్రతల రక్షణకు పోలీస్ స్టేషన్ పరిధిలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, ప్రజల భద్రత ముఖ్యమని, రౌడీషీటర్లపై నిఘా పెట్టాలని, స్టేషన్‌కు వచ్చే వారిదో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. అలాగే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అంతకు ముందుగా సీపీ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఎస్సైలు సురేష్, రవీందర్, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment