హన్మకొండ అర్బన్ : గ్రూప్–4 ద్వారా రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు పొందిన 30 మంది జూనియర్ అసిస్టెంట్లకు (జేఏలు) మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులు నియామక ఉత్తర్వులు అందజేశారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 32 మంది ఎంపిక కాగా వివిధ కారణాలతో ఇద్దరు రిపోర్టు చేయలేదు. మిగిలిన 30 మందిలో 11 మందికి కలెక్టరేట్‌లో, 8 మందికి పరకాల, హనుమకొండ ఆర్డీఓ కార్యాలయాల్లో, 9 మందికి జిల్లాలోని వివిధ తహసీల్దార్ కార్యాలయాల్లో, మరో ఇద్దరికి జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్లుగా పోస్టింగులు ఇచ్చారు. వీరంతా ఒకట్రెండు రోజుల్లో రిపోర్టు చేయనున్నట్లు కలెక్టరేట్ పరిపాలన అధికారి గౌరీశంకర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment