లోకరక్షకుడు ఏసుక్రీస్తు
● అర్ధరాత్రి నుంచి మొదలైన ఆరాధనలు ● కేక్ కటింగ్.. ప్రత్యేక ప్రార్థనలు
జిల్లాలోని పలు చర్చీల్లో మంగళవారం రాత్రినుంచే క్రిస్మస్ ఆరాధనలు ప్రారంభమయ్యాయి. రాత్రి 12 గంటలకు కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండుగ సందర్భంగా కరుణా పురం క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరం, ఫాతిమా కేథడ్రల్ చర్చి, హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్, దేశాయిపేట సెంటినరీ బాప్టిస్ట్, వరంగల్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి, గొర్రెకుంట గిఫ్ట్ ఆఫ్ జీసెస్ తదితర చర్చీలను నిర్వాహకులు విద్యుత్ దీపాలు, స్టార్లు, క్రీస్తుజననం తెలిపే పశువుల పాకలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. కరుణాపురం చర్చి ప్రాంగణంలో 40 ఫీట్ల క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసినట్లు వ్యస్థాపకులు రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్‌రాజ్, గోపు జయప్రకాష్‌లు తెలి పారు. రాత్రి కేక్ కట్ చేసి భక్తులనుద్దేశించి దివ్య సందేశం ఇచ్చారు. కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు జరిపారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రావీణ్య, మేయర్ గుండు సుధారాణి వేర్వేరుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
– కాజీపేట రూరల్/ధర్మసాగర్
Comments
Please login to add a commentAdd a comment