బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి నామినేషన్లు
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ జిల్లా అధ్యక్ష, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల పదవులకు నామినేషన్లు స్వీకరించారు. పార్టీ జిల్లా ఎన్నికల అధికారి వేముల నరేందర్‌రావు, సహ ఎన్నికల అధికారి గడల కుమార్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్ష పదవికి నలుగురు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఒక్కో నియోజకవర్గానికి ఒకరు చొప్పున మూడు నియోజవర్గాలకు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. రెండు రోజులపాటు నామినేషన్లు స్వీకరించి అధ్యక్షుడు, కౌన్సిల్ సభ్యుల ఎన్నికను ధ్రువీకరిస్తూ రాష్ట్ర పార్టీ ఎన్నికల అధికారి ప్రకటిస్తారని జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, క్రియాశీల సభ్వత్వ నమోదు ఇన్‌చార్జ్ ఏర్కుల రఘునరెడ్డి, కానుకుంట్ల రంజిత్, పోలెపాక మార్టిన్, లూథర్, పొట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన
ఆంగ్ల ప్రయోగ పరీక్షలు
కాళోజీ సెంటర్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఆంగ్ల ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. జిల్లా పరీక్షల కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని పలు కళాశాలల్లో పరీక్షల నిర్వహణను శనివారం ఆయన పరిశీలించారు. జిల్లాలో 5,403 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉండగా.. 5,318 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఐఈఓ పేర్కొన్నారు.
ముత్తోజిపేటను సందర్శించిన
లడఖ్ బృందం
నర్సంపేట రూరల్: నర్సంపేట మండలంలోని ముత్తోజిపేట గ్రామాన్ని లడఖ్ రాష్ట్రంలోని 18 మంది సభ్యుల బృందం శనివారం సందర్శించిందని నర్సంపేట ఐకేపీ ఏపీఎం మహేందర్ తెలిపారు. ప్రగతి, ప్రతిభ వీఓలకు చెందిన మూడు ఎస్‌హెచ్‌జీలు తీసుకున్న రుణాలతో చేస్తున్న వ్యాపారాలు, ఆదాయం, ఆర్థికాభివృద్ధి గురించి వారికి వివరించినట్లు పేర్కొన్నారు. అనంతరం ముత్తోజిపేట గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో వీఓ సంఘాల సమావేశాలను పరిశీలించారు. మూడు సంఘాల సభ్యులు, లీడర్లు, వీఓఏలు, సీసీలు, లడఖ్
బృందం సభ్యులు, ఓఎంఎస్ ఓబీసీ అరుణ, కవిత, వీణ తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ ఆకస్మిక తనిఖీ
నల్లబెల్లి: మండలంలోని పలు పాఠశాలలను డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. రుద్రగూడెం ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు రెండు రోజులుగా గైర్హాజరవుతున్నాడని గమనించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ రిజిస్టర్‌లో సీఎల్ వేయడం ఏమిటని, సంబంధిత ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం సరిగా పెట్టడం లేదని, గుడ్లు పూర్తిగా ఇవ్వడం లేదని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వంట ఏజెన్సీ తొలగించాలని ప్రధానోపాధ్యాయుడికి సూచించారు. శనిగరం ఉన్నత పాఠశాలలో రికార్డుల నిర్వహణ సరిగా లేదన్నారు. 2021 విద్యా సంవత్సరం నుంచి అకౌంట్స్ రిజిస్టర్ కనిపించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.
గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
నర్సంపేట రూరల్: అక్రమంగా నిల్వ చేసిన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నర్సంపేట వల్లభ్‌నగర్ శివారులోని అన్న శ్రీకాంత్ ఇంట్లో గుట్కా ప్యాకెట్లు ఉన్నట్లు పక్కా సమాచారం రావడంతో శనివారం సాయంత్రం టాస్క్‌ఫోర్స్, నర్సంపేట పోలీసులు సంయుక్తంగా దాడులు చేసినట్లు పేర్కొన్నారు. రూ.91,600 విలువైన గుట్కాలు, టొబాకో ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీధర్, సిబ్బంది, నర్సంపేట టౌన్ ఎస్సై రవికుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment