ఖిలా వరంగల్ : లారీ ఈఎంఐ చెల్లించలేదని ఇంట్లోకి ప్రవేశించి మహిళలపై దౌర్జన్యానికి పాల్పడిన ఓ ప్రైవేట్ ఫైనాన్స్ నిర్వాహకుడిపై మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు అజ్మత్ తెలిపారు. బాధితుడి కథనం ప్రకారం.. శివనగర్‌కు చెందిన అజ్మత్.. లారీ కొనుగోలు నిమిత్తం ఓ ఫైనాన్స్ నిర్వాహకుడి వద్ద రూ. 5.70 లక్షలు తీసుకున్నాడు. డిసెంబర్‌లో తన కుమార్తె అనా రోగ్యానికి గురికావడంతో రెండు నెలల ఈఎంఐ చెల్లించలేదు. దీంతో శనివారం ఉదయం అజ్మత్ లేని సమయంలో సదరు ఫైనాన్స్ నిర్వాహకుడు ఇంట్లోకి ప్రవేశించి మహిళలను దుర్భాషలాడుతూ భయభ్రాంతులకు గురిచేశాడు. మరో నెల రోజుల సమయం ఇవ్వాలని కోరినా వినకుండా దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై సదరు ఫైనాన్స్ నిర్వాహకుడిపై మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు అజ్మత్ తెలిపారు.
నిర్వాహకుడిపై పోలీసులకు ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment