● ఎన్పీడీసీఎల్ సీజీఎం టి.మధుసూదన్
హన్మకొండ: విధి నిర్వహణలో ఉద్యోగుల పని తీరును మరింత మెరుగుపర్చడానికి, వారిని ప్రోత్సహించేందుకు ఉత్తమ ఉద్యోగులుగా గుర్తించి ప్రశంసపత్రాలు అందిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ హెచ్‌ఆర్డీ చీఫ్ జనరల్ మేనేజర్ టి.మధుసూదన్ తెలిపారు. కష్టపడి పనిచేసే తత్వానికి గుర్తింపుగా ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసపత్రాలు అందించినట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. ప్రస్తుతం ఉద్యోగుల పనితీరును పరిశీలించి ఉన్నతాధికారుల సిఫారసు ఆధారంగా ప్రశంసపత్రం అందించినట్లు పేర్కొన్నారు. ఏసీబీ కేసు లేని వారినే ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment