కాళోజీ సెంటర్: జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఎలగందుల వైష్ణవి బంగారు పతకం సాధించిందని ప్రధానోపాధ్యాయుడు పుట్ట రమేశ్ తెలిపారు. శనివారం పాఠశాలలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించి పాఠశాలకు గుర్తింపు తీసుకురావాలని కోరారు. అనంతరం వైష్ణవి, పీఈటీ అనిల్‌ను ఉపాధ్యాయులు రాజ్‌కుమార్, రాజమౌళి, కొంగ శ్రీనివాస్, శ్రీవాణి, పోగు అశోక్, తిలక్, శైలజ, అంజూమ్, అనూష, గౌస్‌మొహినుద్దీన్, కరుణకుమారి, శేషాచారి, నారాయణరెడ్డి, వెంకటరమణ తదితరులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment