భీమవరం బీసీ కాలనీలో నీటమునిగిన రోడ్డు
భీమవరం(ప్రకాశం చౌక్): తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పల్లపు ప్రాంతాలు నీటమునిగాయి. దాంతో జనం రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. రోజంతా వర్షం కురవడంతో చిరు వ్యాపారుల ఉపాధి దెబ్బతింది. పట్టణాల్లో పుట్‌పాత్ వ్యాపారాలు సాగలేదు.
రికార్డు వర్షపాతం : మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జిల్లాలో సగటున 168.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భీమవరంలో 217.2 మి.మీ, పాలకోడేరు 191.4 మి.మీ, వీరవాసరం 181.5, ఉండి 209.2, కాళ్ళ 252, ఆకివీడు 275, ఆచంట 150, నర్సాపురం 126, పాలకొల్లు 266, యలమంచిలి 124.4, తణుకు 112.2, తాడేపల్లిగూడెం 130, గణపవరం 220.2, పెంటపాడు 136.6, అత్తిలి 114, ఇరగవరం 103.2, పెనుమంట్ర 104.8, పోడూరు 111.4, పెనుగొండ 110.6, మొగల్తూరు 227 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. బుధవారం కూడా జిల్లాలో భారీ వర్షాలు ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. అత్యవసర సాయం కోసం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 08816 299219 ను ఉపయోగించుకొవాలన్నారు. బలహీనంగా ఉన్న ఏటిగట్లు, వంతెనలు, తదితర ప్రాంతాల్లో ముందస్తు చర్యలకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment