జగన్ వెంటే.. జెడ్పీటీసీలంతా..
ఏలూరు టౌన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే జెడ్పీటీసీల ప్రయాణం అని.. రాష్ట్రంలో పేదలకు అండగా రాబోయే కా లంలో మరింత మెరుగైన రీతిలో సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ పార్టీ విధానాలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్న తీరుపై జెడ్పీటీసీలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. ఏలూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఉమ్మడి పశ్చిమ, తూర్పుగోదావరి జి ల్లాల జెడ్పీటీసీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
జెడ్పీ చైర్‌పర్సన్ తీరుపై ఆగ్రహం
ఉమ్మడి పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు 40 మందికి పైగా హాజరయ్యారు. వీరంతా ఈనెల 11న ఏలూరులో జరిగే జిల్లాపరిషత్ సర్వసభ్య అత్యవసర సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. వైఎస్సార్‌సీపీ జెండా, అజెండా, పార్టీ గుర్తుపైనే తామంతా విజయం సాధించామనీ, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉంటూ.. పార్టీ కోసం పోరాడతామని తీర్మానించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఘంటా పద్మశ్రీకి పదవిని కట్టబెడితే కనీసం జెడ్పీటీసీలకు సమాచారం ఇవ్వకుండా, ఏకపక్షంగా మరో పార్టీ తీర్థం పుచ్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్ పద్మశ్రీపై అనర్హత వేటుకు న్యాయపరమైన పోరాటం చేస్తామని తీర్మానించారు.
ఫిరాయింపులు సరికాదు : పార్టీ జిల్లా అధ్యక్షులు డీఎన్నార్, ముదునూరి, చెల్లుబోయిన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమాజంలో అన్ని కులాలకు సముచిత స్థానం కల్పిస్తూ బీసీలకు పెద్దపీట వేశారని గుర్తుచేశారు. అధికారంలో లేకపోయినా ప్రజల ఆకాంక్షలకు అ నుగుణంగా పనిచేస్తూ అభివృద్ధికి కృషి చేయాల్సిన నాయకులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడటం సరికాదన్నారు. జెడ్పీటీసీలు ప్రత్యేక సమావేశంలో తమ డిమాండ్‌ను కలెక్టర్, జెడ్పీ సీఈఓ ముందు పెట్టాలనీ, దానిపై వెంటనే తీర్మానం చేయాలన్నారు. గత జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి విజయాన్ని అందించిన ప్రజలకు సేవ చేయాల్సిన నా యకులు పక్కచూపులు చూడటం సమర్థనీయం కాదన్నారు. జెడ్పీటీసీలకు పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందనీ సమన్వయకర్తలు భరోసా ఇచ్చారు. సమావేశంలో ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్‌కుమార్, మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్, సమన్వయకర్తలు కొఠారు అబ్బయ్యచౌదరి (దెందులూరు), తెల్లం బాలరాజు (పోలవరం), పుప్పాల వాసుబాబు (ఉంగుటూ రు), తలారి వెంకట్రావు (కొవ్వూరు), కంభం విజయ రాజు (చింతలపూడి), మామిళ్లపల్లి జయప్రకాష్ (ఏలూరు), గుడాల గోపి (పాలకొల్లు) ఉన్నారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీటీసీల సమష్టి పోరు
జెడ్పీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
హాజరైన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు డీఎన్నార్, ముదునూరి
Comments
Please login to add a commentAdd a comment