ఎస్సీ, ఎస్టీలపై నేరాలు అరికట్టేందుకు చర్యలు
సీఐడీ అదనపు ఎస్పీ అస్మ ఫర్హీన్ వెల్లడి
తణుకు: ఎస్సీ, ఎస్టీలపై జరిగే నేరాలను అరికట్టేందుకు పోలీసు వ్యవస్థ మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాల్సి ఉందని సీఐడీ రాజమండ్రి ప్రాంతీయ కార్యాలయం అదనపు ఎస్పీ అస్మ ఫర్హీన్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై శుక్రవారం తణుకులో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలపై నేరాలు జరిగినప్పుడు బాధితులకు చట్టరీత్యా లభించే రక్షణ చర్యలను వివరించారు. ఈ కేసుల్లో అరెస్ట్‌లు జరుగుతున్నా సరైన శిక్షలు పడకపోవడంతోనే తిరిగి నేరాలు పునరావృతం అవుతున్నాయన్నారు. కోర్టులో ట్రయల్ సమయంలో బాధితులు, సాక్షులు సరిగ్గా సాక్ష్యం చెప్పకపోవడంతో నిందితులు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారని అన్నారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాఽథ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు వారికి చెందాల్సిన హక్కులు, సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. అనంతరం విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సదస్సులో తహసీల్దార్ అశోక్‌వర్మ, ఎంపీడీవో జయసాగర్, రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.గోపాలరావు, తణుకు పట్టణ, రూరల్ సీఐలు ఎన్.కొండయ్య, బి.కృష్ణకుమార్, సంక్షేమ శాఖ అధికారులు శోభారాణి, నాగశేషమ్మ, న్యాయవాది జి.అంబేద్కర్, సీఐడీ సీఐలు కేఏ స్వామి, సీహెచ్ వెంకటేశ్వరరావు, రిటైర్డ్ సీఐ కె.సాల్మన్‌రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment