భీమవరం (ప్రకాశం చౌక్): క్షేత్రస్థాయిలో పరిస్థితులను అవగాహన చేసుకుని ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రొహిబిషనరీ సివిల్ సర్వీస్ శిక్షణ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ చాంబర్‌లో పది మంది శిక్షణ అధికారులు కలెక్టర్‌ను కలిసి జిల్లాలో గత ఐదు రోజులుగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన, అవగాహన చేసుకున్న అంశాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలని, ఉత్తమ సేవలు అందించాలని వారికి సూచించారు. అనంతరం వారికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ట్రైనీ సివిల్ సర్వీసెస్ అధికారులు కాత్యాయిని సింగ్, రూపాలి సున, భగత్ షమల్ కళ్యాణ్ రావు, నౌషీన్, శ్రీకృష్ణ, శ్రీరామ సుహెర్, యాష్ చంద్రప్రకాష్ సింఘాల్, లక్ష్మణ్ ఆనంద్, సుశాంత్ కుమార్, రాజేష్ కుమార్, అనికెట్ శాండిల్య, భీమవరం ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment