క్రీడలతో ఆత్మస్థైర్యం మెండు | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో ఆత్మస్థైర్యం మెండు

Published Mon, Nov 18 2024 1:12 AM | Last Updated on Mon, Nov 18 2024 1:11 AM

క్రీడ

క్రీడలతో ఆత్మస్థైర్యం మెండు

భీమడోలు: క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని అందించడంతోపాటు ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపజేస్తాయని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల అడిషనల్‌ కార్యదర్శి సునీల్‌రాజ్‌కుమార్‌ అన్నారు. భీమడోలు మండలంలోని పోలసానిపల్లి బీఆర్‌ అంబేద్కర్‌ సాంఘిక సంక్షేమ బాలికల కశాశాలలో జోన్‌ 2 బాలికల గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. జోన్‌ పరిధిలోని ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన 29 కళాశాలల నుంచి 1,050 మంది బాలికలు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని తమ సత్తా చాటారు. ప్రిన్సిపాల్‌ వీవీ రమణ అధ్యక్షతన జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందించారు. పోటీల విజేతల వివరాలను డీసీవో ఎన్‌.భారతి, ప్రిన్సిపాల్‌ వీవీ రమణ, జోనల్‌ కోఆర్డినేటర్‌ శ్యామల, పీడీ సాయిలక్ష్మి ప్రకటించారు.

స్కూల్‌ గేమ్స్‌ విభాగంలో..

కబడ్డీలో వట్లూరు (పశ్చిమగోదావరి), బల్లిపర్రు (కృష్ణా), వాలీబాల్‌లో వెంకటాపురం(తూర్పుగోదావరి), పోలసానిపల్లి(పశ్చిమ), ఖోఖోలో ద్వారకాతిరుమల, పోలసానిపల్లి జట్లు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. త్రోబాల్‌ పోటీల్లో పోలసానిపల్లి (పశ్చిమ) ముప్పాళ్ల (కృష్ణా), చెస్‌లో ముమ్మడివరం(తూర్పు), ద్వారకాతిరుమల (పశ్చిమ), క్యారమ్స్‌లో తుని, పిఠాపురం జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించాయి. స్పోర్ట్స్‌ చాంపియన్‌షిఫ్‌ను వి.ఇందు(జంగారెడ్డిగూడెం), వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ను పి.పూజ, స్పోర్ట్స్‌ అల్‌రౌండర్‌, గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ చాంపియన్‌షిఫ్‌లను జంగారెడ్డిగూడెం కై వసం చేసుకున్నాయి.

కళాశాల గేమ్స్‌ విభాగంలో..

కబడ్డీలో గోపాలపురం(తూర్పు), కుంటముక్కల (ఎన్టీఆర్‌), వాలీబాల్‌లో పి.వెంకటపురం (తూర్పు), గోపాలపురం (తూర్పు), ఖోఖోలో ఏలేశ్వరం(తూర్పు), పోలసానిపల్లి (పశ్చిమ). త్రోబాల్‌ విభాగంలో పోలసానిపల్లి, జంగారెడ్డిగూడెం ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించాయి. చెస్‌ విభాగంలో వీరపనేనిగూడెం (కృష్ణా), పి.వెంకటపురం (తూర్పు), క్యారమ్స్‌లో వీరపనేనిగూడెం (కృష్ణా), ముమ్మడివరం(తూర్పు) మొదటి రెండు స్థానాలు సాధించాయి. స్పోర్ట్స్‌ విభాగంలో చాంపియన్‌ వి.నిఖిత (ముప్పాళ్ల), వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ కె.లావణ్య (తుని), అల్‌రౌండ్‌ స్పోర్ట్స్‌ చాంపియన్‌షిప్‌ గోపాలపురం, ఆల్‌రౌండ్‌ గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ విభాగంలో గోపాలపురం, చాంపియన్‌షిప్‌ను పోలసానిపల్లి కై వసం చేసుకుంది.

పాఠశాల, కళాశాల స్థాయిలో విజేతలు వీరే

100 మీటర్ల పరుగులో జి.విమలశ్రీ, టి.పూజ, టి.నీలిమప్రియ, 200 మీ. పరుగులో సీహెచ్‌ కుమారి, డి.ప్రీతిక, కె.మనీషా, 400 మీ. పరుగులో పి.పూజ, కె.హేమకుమారి, బి.రమ్య, 800 మీ. పరుగులో వి.ఇందు, సీహెచ్‌ కుమారి, కె.హేమకుమారి, డిస్కస్‌ త్రోలో కె.కృష్ణశ్రీ, కె.శ్రీవల్లి, ఎన్‌.రాణి, జావెలెన్‌త్రోలో ఎన్‌.రాణి, కె.శ్రీవల్లి, సీహెచ్‌ సమీరా, లాంగ్‌జంప్‌లో బి.రమ్యశ్రీ, వై.రమ్యశ్రీ, సీహెచ్‌ దివ్యశ్రీ, హైజంప్‌లో బి.రమ్యశ్రీ, సీహెచ్‌ శిరీషా, దివ్యశ్రీ, షాట్‌ఫుట్‌లో పి.కీర్తన, పి.కృష్ణవేణి, డి.శ్రీలత, వ్యక్తిగత చాంపియన్స్‌లో వి.ఇందు, పి.పూజ, బి.రమ్యశ్రీ విజేతలుగా నిలిచారు.

గురుకుల కళాశాల అడిషనల్‌ కార్యదర్శి సునీల్‌రాజ్‌కుమార్‌

ముగిసిన జోనల్‌ పోటీలు

No comments yet. Be the first to comment!
Add a comment
క్రీడలతో ఆత్మస్థైర్యం మెండు 1
1/1

క్రీడలతో ఆత్మస్థైర్యం మెండు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement