మినీ అంగన్వాడీల ఆవేదన
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం కలెక్టరేట్ వద్ద శనివారం జిల్లాలోని మినీ అంగన్వాడీ వర్కర్లు వారి సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సీహెచ్ ఝాన్సీలక్ష్మి, సెక్రటరీ డి.కల్యాణి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఇక్కడ ధర్నా చేశామన్నారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీఓ ఇవ్వాలని, వర్కర్లకు పదోన్నతులు, వేసవిలో సెలవులు, మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరారు. గ్రేడ్–2 సూపర్వైజర్ పోస్టులకు తమకు కూడా అవకాశం కల్పించాలని, మట్టి ఖర్చులు ఇవ్వాలని తదితర డిమాండ్లతో వినతిపత్రం అందజేశామన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి మినీ అంగన్వాడీ కార్యకర్తల యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment