● నోరూరిస్తున్న ముంబై జామ
హాయ్ రే హాయ్... జాంపండురోయ్, ఏమి రూపురా! ఏమి రుచిరా! అంటూ హాయిగా పాట పాడుకుంటూ తినేసే విధంగా ఉంది ముంబై జామ పండు. గత రెండు రోజులుగా మార్కెట్‌లోకి ముంబై జామ రావడంతో గిరాకీ భారీగా పెరిగింది. పెద్ద సైజులో దోరగా కంటికి ఇంపుగా ఈ ముంబై జామ పండు ఉంది. ఈ జామకాయ ఒకొక్కటి రూ. 50ల పైబడి ఉంది. దేశవాళీ జామకాయలను జ్యూస్‌కు కంపెనీలకు తరలిస్తుండడంతో మార్కెట్‌కు రావడం తగ్గిపోయింది. అయితే కొన్నిరోజులుగా ముంబై జామ రావడంతో పెద్ద ఎత్తున ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. – ఆకివీడు
Comments
Please login to add a commentAdd a comment