మీకోసం ఎవరి కోసం?
తణుకు ప్రాంతంలోని పశువధ శాలపై మీ–కోసంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎలాంటి దుర్గంధం లేదని అధికారులు క్లీన్‌చిట్ ఇచ్చేశారు. 8లో u
బుధవారం శ్రీ 18 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
పందెంకోళ్లు..
పోలీసులూ
సాక్షి ప్రతినిధి, ఏలూరు
వారానికి మూడు చోట్ల కోడి పందేలు..
ముందుగానే పందెంరాయుళ్లకు ఫోన్‌లో లొకేషన్ సమాచారం..
స్థానిక పోలీసులతో ముందుగానే మాటామంతీ...
ఎమ్మెల్యేల కార్యాలయం నుంచి ప్రత్యేక ఆదేశాలు..
అత్యంత పకడ్బందీగా గత కొన్ని రోజులుగా ఉమ్మడి పశ్చిమలో కోడి పందేలు పెద్ద ఎత్తున జరుగుతున్నా ఎలంటి చర్యలు లేవు. లక్షలతో మొదలయ్యే ఈ పందేలు కోట్ల వరకు జరుగుతున్నాయి. దీంతో పందేల్ని వ్యసనంగా మార్చుకున్న కొందరు సామాన్యులు సమిధలుగా మారుతున్నారు. కేవలం సంక్రాంతి సమయంలో వినోదంగా జిల్లాలో ఈ కోడి పందేలు నిర్వహిస్తారు. అప్పుడప్పుడు పోలీసుల కళ్లుగప్పి పందేలు నిర్వహించినా అడపాదడపా మాత్రమే..
అయితే ఇప్పుడు కోడి పందేలు కూటమి నేతలకు ఆదాయ వనరుగా మారింది. దీంతో నెలలు తరబడి ఈ పందేలు యథేచ్ఛగా సాగుతున్నా.. పత్రికలు, టీవీల్లో వార్త కథనాలు వస్తున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. గత 15 రోజుల నుంచి జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో ఉధృతంగా పందేలు సాగుతున్నా ఒక్క కేసు కూడా నమోదు కాని పరిస్థితి.
ఎప్పటికప్పుడు బరుల మార్పు
ఇప్పటికే మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న కొందరు కూటమి నేతలు, గత కొంతకాలంగా కోడి పందేలపై దృష్టి పెట్టారు. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ ఎత్తున పందేలకు తెరలేచింది. తాడేపల్లిగూడెం, ఉండి, భీమవరం నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో భారీగా పందెం బరులు వెలిశాయి. వారానికి మూడు, నాలుగు చోట్ల వీటిని సిద్ధం చేస్తున్నారు. ఒకే చోట నిర్వహించకుండా బరులు మారుస్తూ ఎప్పటికప్పుడు పందెంరాయుళ్లకు సమాచారం ఇస్తున్నారు. జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాలు, హైదరాబాద్ నుంచి పందెంరాయుళ్లును ప్రత్యేకంగా రప్పించి భారీగా సొమ్ముచేసుకుంటున్నారు.
సిండికేట్‌గా మారి బరుల ఏర్పాటు
కోడి పందేలపై ఆసక్తి ఉన్న ఇద్దరు ప్రజాప్రతినిధులు గత 20 రోజుల నుంచి ఈ పందేలను అందరికీ తెలిసేలా సాగిస్తున్నారు. ప్రధానంగా భీమవరం, వీరవాసరంలో జనసేన, టీడీపీ నేతలు ఒక ప్రజాప్రతినిధి ఆదేశాలతో సిండికేట్‌గా మారి భారీగా బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఒక కీలకనేత చక్కబెడుతూ రెవెన్యూ మొదలుకొని పోలీసుల వరకు అన్ని వ్యవస్థలను ముడుపులతో మేనేజ్ చేసి పందేలు కొనసాగిస్తున్నారు. దీంతోపాటు అక్కడే తినుబండారాలు మొదలుకొని మద్యం వరకు అన్ని విక్రయించే ఏర్పాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో వ్యాపారం జోరుగా సాగుతోంది.
న్యూస్‌రీల్
కూటమి ప్రజాప్రతినిధులే రింగ్ లీడర్లు
ఉమ్మడి పశ్చిమ గోదావరిలో భారీగా కోడి పందేలు
రోజుకో చోట పందెం బరులు.. వాట్సప్‌లో సమాచారం
పోలీసులకు పక్కా సమాచారం ఇచ్చి మరీ పందేలు
Comments
Please login to add a commentAdd a comment