యలమంచిలి: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు గోదావరిలో పడి మృతి చెందాడని ఎస్సై కర్ణీడి గుర్రయ్య తెలిపారు. దొడ్డిపట్ల గ్రామానికి చెందిన పొన్నాడి ఏసురాజుకు (35) చేపల వేట జీవనాధారం. రోజూ మాదిరిగానే గురువారం ఉదయం ఆరు గంటలకు గోదావరిలో వేటకు వెళ్లాడు. ఏం జరిగిందో తెలియదు కాని ఎనిమిది గంటల సమయంలో అతడి మృతదేహం గోదావరి ఒడ్డుకు కొట్టుకువచ్చింది. ఏసురాజు మృతదేహాన్ని గుర్తుపట్టిన ఏడుకొండలు అనే వ్యక్తి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఏసురాజుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఏసురాజు భార్య ధనలక్ష్మి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై గుర్రయ్య చెప్పారు. మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment